దయచేసి వినండి! ట్రైన్ నెంబర్ 123.. ఇలా రైల్వే స్టేషన్ లో అనౌన్సుమెంట్ ఇచ్చే లేడీ ఎవరో తెలుసా?

దయచేసి వినండి! ట్రైన్ నెంబర్ 123 సూపర్ ఎక్స్ ప్రెస్ ఒకటవ నెంబర్ ప్లాట్‌ ఫారం పైకి వచ్చును అని ఇలా ప్రతి రైల్వేస్టేషన్ లో ఇలాంటి అనౌన్సుమెంట్ ఒకటి మనం కచ్చితంగా వినే ఉంటాం.

Update: 2020-02-09 09:08 GMT

దయచేసి వినండి! ట్రైన్ నెంబర్ 123 సూపర్ ఎక్స్ ప్రెస్ ఒకటవ నెంబర్ ప్లాట్‌ ఫారం పైకి వచ్చును అని ఇలా ప్రతి రైల్వేస్టేషన్ లో ఇలాంటి అనౌన్సుమెంట్ ఒకటి మనం కచ్చితంగా వినే ఉంటాం.. మరి ఎప్పుడైనా ఆ వాయిస్ ఎవరిదీ అన్నది మాత్రం మనం ఆలోచించం కదా! ఇంతకి ఆమె ఎవరు అన్నది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. ఆమె పేరు సరళా చౌదరి. ఆమె వయసు ప్రస్తుతం 49 సంవత్సరాలు.. 1982 సంవత్సరంలో సెంట్రల్ రైల్వేలో అనౌన్సుర్ ఉద్యోగం కోసం చాలా మంది యువతులు వచ్చారు. అందులో సరళా చౌదరి ఒకరు..

ఆమె గొంతు విన్నా అప్పటి జీఎం ఆషితోష్ బెనర్జీ అ ఉద్యోగానికి ఆమెని ఎంపిక చేశారట! ఇక అప్పటినుంచి ఆమె ఉద్యోగం చేసుకుంటూ వస్తున్నారు. మొదటి నాలుగు సంవత్సరాలు ఆమె ఉద్యోగం టెంపరరీగానే ఉంది. కానీ 1986లో ఆమె ఉద్యోగాన్ని పర్మినెంట్ చేశారు. ఇక అప్పటినుంచి ఆమె ఎన్నో రైళ్ళకి తన గొంతుతో అనౌన్సుమెంటుని వినిపించారు సరళా చౌదరి.. ఇక అప్పట్లో కంప్యూటర్లు లేకపోవడంతో ప్రతి అనౌన్సుమెంట్ ని ఆమె చదివి వినిపించేవారు. ఇక కంప్యూటర్లు వచ్చాక రైల్వేలో, ట్రైన్లలో ట్రైన్ మేనేజ్మెంట్ సిస్టంని ఏర్పాటు చేశారు. దీనితో సరళా చౌదరి ఒకేసారి కొన్ని వేల రికార్డ్స్ లని చేసి ఇచ్చేవారు. ఇక వాటిని రైల్వే వారు అలాగే భద్రపరిచి ఆటోమాటిక్ అనౌన్సుమేంట్ వచ్చేలా ఏర్పాట్లు చేశారు. అలా సరళా చౌదరి చాలా ఫేమస్ అయ్యారు.

సరళా చౌదరి ఇంత ఫేం సంపాదించుకున్నప్పటికీ తన పదవికి మాత్రం 12 ఏళ్ల కిందటే పదవి విరమణ చేశారు. అయితేనేం ఆమె గొంతు ఇప్పటికి ఎక్కడకి వెళ్ళిన వినిపిస్తుంది. ఒక్కోసారి ఈ గొంతును వింటుంటే ఆమె చాలా ఉద్వేగానికి లోను అవుతూ ఉంటారట!  

Tags:    

Similar News