3,10,20 రూపాయలకే చీరలు .. ఇక్కడే జనాల చెవుల్లో పూలు ..

Update: 2019-07-05 13:14 GMT

ఆఫర్ ఆఫర్ అంటే ఎవరు వద్దు అంటారు చెప్పండి . అందులో మళ్ళీ చీరల ఆఫర్ అంటే ఇక ఎవరైనా ఆగుతారా చెప్పండి .. అ ఆఫర్ పెట్టిన దుకాణం ముందు రోడ్ల పైన మహిళలు లైన్లో బారులు తీరుతారు ..ఇంకా 3,10,20 రూపాయలకే చీరలు అంటే ఇంకెలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి .. ఇలాంటి ఆఫర్స్ పెట్టి జనాల చేవ్వుల్లో పువ్వులు పెడుతున్నారు షాప్ యజమానులు ..

అగ్వాకే చీర - దొంగల పనితనం: -

ఇలాంటి ఆఫర్స్ ను తాజాగా సిద్దిపేట , వరంగల్ , పెద్దపల్లిలో ప్రకటించారు షాప్ యజమానులు .. దీనితో మహిళలు భారీ సంఖ్యలో చేరారు . అక్కడి స్థానికులు మాత్రమే కాకుండా పక్క గ్రామాల్లో ఉన్న మహిళలు మరియు వారి బందువులు చాలా మంది షాప్ తెరవక ముందే లైన్ లో నిలుచున్నారు .. షాప్ ఓపెన్ చేయగానే ఒక్కసారిగా షాప్ లోకి మహిళలు ఎగబడడంతో తొక్కిసలాట జరిగింది .ఈ క్రమంలోనే దొంగలు తమ చేతి వాటం చూపించారు .. ఒక ఆమె మూడు తులాల బంగారం మాయం చేసారు . మరో మహిళవి ఏడూ వెయిల రూపాయలు మాయం చేసారు . దీనితో దుకాణాదారులు చేసేది ఏమి లేకా దుకాణం మూసేసారు ..దీనితో అక్కడికి వచ్చినా వారందరూ మూడు, పది , ఇరవై రూపాయలకు చీర అని చెప్పి మా రోజు వారి కూలీని పోగొట్టారని తిట్టుకుంటూ పోయారు ..

షాప్ యజమానుల ట్రిక్స్ ..

నిజానికి ఇలాంటి ఆఫర్స్ అయితే కొత్తగా ఏర్పాటు చేసినా షాప్స్ మాత్రమే ప్రకటిస్తాయి .. దీనితో జనాలు ఎగబడుతారు . తెలిసినా వారు మరో తెలియని ముగ్గురికి వెళ్లి చెబుతారు . ఇలా ఇలా ముందుగా షాప్ కి ఎక్కడలేని పబ్లిసిటీ వస్తుంది . ఇక చీరలు అంటారా..! 20 రూపాయలకు చీరలు మహా అయితే 200 అమ్ముతారు. నిజానికి వాటి ధర 80 నుండి 100 లోపే ఉంటుంది . ఇలా అమ్మడం వల్ల షాప్ యాజమాన్యానికి వేయిల్లో మాత్రేమే లాస్ వస్తుంది . కానీ ఇదే షాప్ ని పేపర్లో ప్రకటన ఇవాలంటే కనీసం లక్షల్లో కూడుకున్న వ్యాపారంగా ఉంటుంది .. దీనితో షాప్ కి ఇప్పుడు ఎక్కడ లేని పబ్లిసిటీ వస్తుంది .

ఇక అమ్మినా చీరలు కూడా ఎక్కువ రోజులు కూడా రావు ఒక్కసారి దానిని ఉతకగానే చీర రుపరేఖలు ఒక్కసారిగా మారిపోతాయి . ఇలా ఆఫర్స్ ఉన్నాయి కదా అని వెళితే అన్ని విషయాల్లో మనకే లాస్ వస్తుంది . ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఎవరు లాస్ కావాలని వ్యాపారం చేయరు .. 

చెవుల్లో పూలు 

Similar News