రియల్ హీరోస్ : వంటమనిషి కోసం రోడ్డెక్కిన యజమానులు...

Update: 2019-10-06 04:31 GMT

సహజంగానే మంచిగా చదువుకున్నా వాళ్ళు చదువుకు తగ్గ ఉద్యోగం చేసుకుంటే బాగుంటదని ఎవరైనా అనుకుంటారు. కానీ రోడ్లపై టిఫిన్స్ అమ్ముకుంటే మాత్రం ఆశ్చర్యంగానే చూస్తారు. అవును ఇలాగే ఓ ఇద్దరు ఎంబీఎ చదువుకొని రోడ్డుపై టిఫిన్స్ అమ్ముతుంటే ఓ మహిళ చూసి ఆశ్చర్యపోయింది. ముంబైలోని కాందీవలీ స్టేషన్ వద్ద ఒక మహిళ ఇటీవల టిఫిన్ చేసేందుకు బయటకు వచ్చింది. దారిలో ఆమెకు రోడ్డు పక్కగా టిఫిన్లు అమ్ముతున్న ఈ జంట కనిపించింది. వారిని వెళ్లి వివరాలు అడిగింది. వారు చెప్పిన సమాధానం చూసి ఆశ్చర్యపోయింది.

ఇక్కడ టిఫిన్స్ అమ్ముతున్న ఈ జంటకి మంచి ఉద్యోగం ఉంది. ఆ ఉద్యోగంలోనే మంచి జీతం కూడా ఉంది. కానీ వారి ఇంట్లో పనిచేసే 55 ఏళ్ల వంట మనిషి భర్త పక్షవాతానికి గురియ్యాడు. దీనితో ఆమెపైనే ఇంటి బాధ్యత పడింది. దీనిని అర్ధం చేసుకున్న ఈ జంట ఆమె చేసిన టిఫిన్స్ ని ఇలా ఉదయం 4 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకూ అమ్ముతుంటారు. ఆ తరువాత ఎవరి జాబుకి వారు వెళ్ళిపోతారు... వారు చేస్తున్న ఈ సహాయానికి నెటిజన్లు ఫిదా అయ్యారు. సోషల్ మీడియాలో మీరు రియల్ హీరోస్ అని కామెంట్స్ పెడుతున్నారు.  

Tags:    

Similar News