వైరల్ ఫోటో: పిచ్చి పీక్స్ ! శోభనానికి సిపాయిలా సిద్దమంటూ ఫ్లేక్సిలు

ఇప్పటివరకు ప్రచారాలంటే సినీతారలు, రాజకీయ నాయకులదే చూసుంటాం ! ఒక్కోసారి వారి ప్రచారం చూస్తే పిచ్చి పీక్స్ అనిపించవచ్చు. కానీ ఇది చూసాక తక్కువే అనిపిస్తుంది.

Update: 2020-03-02 08:23 GMT
Flexi viral (File Photo)

ఇప్పటివరకు ప్రచారాలంటే సినీతారలు, రాజకీయ నాయకులదే చూసుంటాం ! ఒక్కోసారి వారి ప్రచారం చూస్తే పిచ్చి పీక్స్ అనిపించవచ్చు. కానీ ఇది చూసాక తక్కువే అనిపిస్తుంది. ఎవడైనా పుట్టినరోజుకు, పెళ్ళికి ఇక మరి అంటే చచ్చిపోతే ప్లేక్సిలు కడతారు. కానీ ఇతను మాత్రం నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదురో .. అనుకున్నాడో ఏమో కానీ శోభనానికి సిద్ధమంటూ ఓ ప్లేక్సీ కట్టి మరి ప్రచారం చేశాడు. ఇది ఎక్కడ, అతను ఎవరో అన్న విషయం తెలియదు కానీ ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ ప్లేక్సీలో " నేటితో నా బ్రహ్మాచారి జీవితానికి సంప్రదాయబద్దంగా స్వస్తి పలికి ఎన్నాళ్ళ నుంచో ఎదురుచూస్తున్న తొలి అనుభవానికి తహతహలాడుతూ.. యుద్దానికి సిద్దమైన బాహుబలి వలే ఈ రోజు జరిగే ఈ రాత్రి యుద్దాన్ని, ముహూర్తపు సమయానికి ప్రారంభించి అతి తక్కువ సమయంలోనే నా తల్లితండ్రులను నాన్నమ్మ- తాతయ్యలను చేస్తానని అంత:కరణ శుద్దితో ప్రమాణం చేస్తున్నాను " అని అందులో పేర్కొన్నాడు. అయితే దీనిపైన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. 

Tags:    

Similar News