Flight Delay Rules: ఫ్లైట్‌ ఆలస్యం కారణంగా ఎయిర్‌పోర్ట్‌లో మీకు లభించే హక్కులేంటో తెలుసా..?

Flight Delay Rules: విదేశీ ప్రయాణాలు చేసేటప్పుడు ఒక్కోసారి ఫ్లైట్‌ ఆలస్యమవుతుంది. దీనికి చాలా రకాల కారణాలు ఉంటాయి. చలికాలంలో పొగమంచు కారణంగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.

Update: 2024-01-23 09:30 GMT

Flight Delay Rules: ఫ్లైట్‌ ఆలస్యం కారణంగా ఎయిర్‌పోర్ట్‌లో మీకు లభించే హక్కులేంటో తెలుసా..?

Flight Delay Rules: విదేశీ ప్రయాణాలు చేసేటప్పుడు ఒక్కోసారి ఫ్లైట్‌ ఆలస్యమవుతుంది. దీనికి చాలా రకాల కారణాలు ఉంటాయి. చలికాలంలో పొగమంచు కారణంగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు గంటల తరబడి వెయిట్‌ చేయాల్సి వస్తోంది. దీనికి చింతించాల్సిన పనిలేదు. ఎందుకంటే ఎయిర్‌పోర్ట్‌లో మీకు 5 రకాల హక్కులు ఉంటాయి. ఇవి మీకు అన్ని రకాల సౌకర్యాలను అందిస్తాయి. ఫ్లైట్‌ లేట్‌ అయితే ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారో ఈ రోజు తెలుసుకుందాం.

మీరు ప్రయాణించే ఫ్లైట్‌ లేట్‌ అయితే ఎయిర్‌లైన్ ఉద్యోగుల నుంచి దానికి సంబంధించిన సమాచారం పూర్తిగా తెలుసుకోవచ్చు. ఆలస్యానికి గల కారణాలను అడగవచ్చు. దీనికి వారు కచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి. మీ ఫ్లైట్ మూడు గంటల కంటే ఎక్కువ లేట్‌ అయితే ఎయిర్‌లైన్ కంపెనీ మీకు రిఫ్రెష్‌మెంట్స్ ఇస్తుంది. ఇందులో తాగడానికి నీరు, బిస్కెట్లు, ఇతర వస్తువులు ఉంటాయి. మీ బోర్డింగ్ పాస్‌ని చూపించి ఈ రిఫ్రెష్‌మెంట్‌ సౌకర్యాలను పొందవచ్చు. ఇది మీకు ఇవ్వకపోతే మీరు దీనిని డిమాండ్ చేయవచ్చు.

మీ ఫ్లైట్ 6 గంటల కంటే ఎక్కువ లేట్‌ అయితే ఎయిర్‌లైన్ కంపెనీ మీకు 24 గంటల ముందుగానే తెలియజేయాలి. తర్వాత ప్రయాణీకులు తమ టిక్కెట్ల వాపసు చేసుకోవచ్చు. ఇది కాకుండా మీరు మరొక విమానంలో సీటును డిమాండ్ చేయవచ్చు. ఒకవేళ మీ ఫ్లైట్ రద్దు అయితే దాని గురించి 24 గంటల ముందుగానే మీకు తెలియజేయాలి. లేదంటే మీరు టికెట్‌ వాపసు పొందడమే కాకుండా రూ.5,000 నుంచి రూ.10,000 వరకు పరిహారం చెల్లించాలి. మీ ఫ్లైట్ సాయంత్రం వేళలో ఉంటే అది నిరంతరం లేట్‌ అవుతుంటే మీకు హోటల్ గది కేటాయిస్తారు. విమానం మరుసటి రోజు షెడ్యూల్ చేయబడినప్పుడు మాత్రమే ఈ రూల్‌ వర్తిస్తుంది. తర్వాత ఎయిర్‌లైన్ కంపెనీ మీ వసతి, భోజన ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది.

Tags:    

Similar News