జూలో మూగజీవాలు..చలికి వణకకుండా ఏం చేసారో తెలుసా ?

చలికాలం వచ్చేసింది. రోజు రోజుకు చలి పెరిగిపోతుంది. ఈ చలికి బయటికి వెళ్లాలంటే చాలు ఒంటినిండా కప్పుకుని బయటికి వెళతాం అయినా చలికి తట్టుకోలేక గజగజా వనుకుతాం.

Update: 2020-01-01 05:26 GMT

చలికాలం వచ్చేసింది. రోజు రోజుకు చలి పెరిగిపోతుంది. ఈ చలికి బయటికి వెళ్లాలంటే చాలు ఒంటినిండా కప్పుకుని బయటికి వెళతాం అయినా చలికి తట్టుకోలేక గజగజా వనుకుతాం. ఇంత జాగ్రత్తలు తీసుకునే మనమే చలికి తట్టులేక పోతే మరి రోడ్లపైన జంతువుల సంగతేంటి. ఇలాంటి ఆలోచనే అస్సాంలోని గౌహతి జూ అధికారులకు కూడా వచ్చింది. ఎప్పుడూ బయటే తిరిగే మూగ జీవాలకు చలి పెట్టదా అని ఆలోచించారు. అవి కూడా మనుషుల్లానే చలి నుంచి తప్పించుకోడానికి ప్రయత్నిస్తాయని కనుకున్నారు. ఎంత చలిపెట్టినా చలికి వణుకుతూ బాధపడాల్సిందేనా అని బాధపడ్డారు. జూలో ఉండే జంతువుల కోసం ఎదైనా చేయాలని ఆలోచించి ఓ వినూత్న ప్రయత్నం చేసారు, అస్సాం స్టేట్‌ జూ కమ్‌ బొటానికల్‌ గార్డెన్‌ అధికారులకు.

జూలో బోనులో ఉన్న పులులు, సింహాలు చలికి వనకకుండా వెచ్చదనాన్ని అనుభవించే విధంగా ఏర్పాట్లను చుసారు. బోన్ ఎన్‌క్లోజర్‌ వెలుపల హీటర్‌లను ఏర్పాటు చేశారు. ఇంకేముంది ఈ హీటర్ల వేడికి జంతువుల వెచ్చగా సేదతీరుతున్నాయి. అయితే ఇందులో ఇంకో చిన్న ట్విస్ట్ ఉంది. అన్ని జంతువులకు హీటర్‌ అంత మంచిది కాదని జూ సిబ్బంది కనుకున్నారు. దీంతో పచ్చిక బయళ్లపై తిరుగాడే జింక, తదితర జంతువుల కోసం ప్యాడీ స్ట్రాలను అక్కడి గడ్డిపై పరిచారు. దీంతో జూలో ఉన్న జంతువులన్నీ చలికి వనకకుండా వెచ్చగా హాయిగా ఉంటున్నాయి. ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అన్నట్టు, ఇప్పుడు ఒక ఐడియా మూగ జీవాల చలినే పారద్రోలింది. ఇక ఇలాంటి హీటర్లనే అన్ని జూలలో ఏర్పాటు చేస్తే జంతువులన్నీ చలికాలంలో చలిబారిన పడకుండా హాయిగా సేదదీరుతాయి.  

Tags:    

Similar News