వాహనాన్ని వెంబడించిన ఏనుగు.. రివర్స్ గేర్‌ లోనే వెనక్కి మళ్లించిన అటవీ అధికారులు

Update: 2020-01-17 05:02 GMT

కర్ణాటకలో అటవీ అధికారులు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. మైసూర్ దగ్గర్లోని హన్సూర్ తాలూకాలోని అటవీ ప్రాంతంలోకి వచ్చిన అధికారుల వాహనాన్ని ఓ భారీ ఏనుగు వెంబడించింది. రోడ్డుపై వెళ్తున్న వాహనానికి ఎదురుగా వచ్చిన ఏనుగు ఎదురుతిరగడంతో వాహనాన్ని రివర్స్‌ గేర్ లోనే వెనక్కి మళ్లించారు. ఒకానొక సమయంలో వాహనం దగ్గరకు వచ్చిన ఏనుగు అంతలోనే అక్కడి నుంచి వెనక్కి వెళ్లింది. ఏనుగు దగ్గరకు రావడంతో భయపడ్డ అధికారులు అరుపులు కేకలు పెట్టారు.



Tags:    

Similar News