Love Propose: ఇదేందయ్యా ఇది..ఇది నేను చూడలా... వెరైటీ లవ్ ప్రపోజల్.. ప్రియురాలు ఫ్లాట్
Love Propose: ఇదేందయ్యా ఇది..ఇది నేను చూడలా... వెరైటీ లవ్ ప్రపోజల్.. ప్రియురాలు ఫ్లాట్
ఇదేందయ్యా ఇది..ఇది నేను చూడలా... వెరైటీ లవ్ ప్రపోజల్.. ప్రియురాలు ఫ్లాట్
Love Propose: ప్రేమ ఒక మధురానుభూతి. ఇక తమ ప్రేమను తెలియజేసి అమ్మాయిలను గెలుచుకునేందుకు అబ్బాయిలు రకరకాల మార్గాల్లో ప్రయత్నిస్తుంటారు. కొంతమంది అబ్బాయిలు తమ ప్రేమను గ్రీటింగ్ కార్డ్స్ రూపంలో వ్యక్తం చేస్తే, మరికొందరు కాస్ట్లీ గిఫ్ట్స్ ఇచ్చి తమ ప్రేమను వ్యక్తపరుస్తుంటారు. ఇంకొంతమంది అయితే స్నేహితులను వారధిగా వాడుకుంటారు. అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది.
వీడియోలో ఒక జంట బైక్ పై వెళ్తూ కనిపిస్తారు. వారిని ఓ వ్యక్తి బైక్ పై క్రాస్ చేస్తాడు. ఆ వ్యక్తి టీ షర్ట్ వెనక హార్ట్ సింబల్ ఉంటుంది. ఆ వెంటనే మరో వ్యక్తి కూడా జంటను క్రాస్ చేస్తాడు. అతడి టీ షర్ట్ పై ఐ అనే ఆంగ్ల అక్షరం ఉంటుంది. ఇక ఆ వెంటనే మరో వ్యక్తి...అతడి టీ షర్ట్ పై ఆంగ్ల అక్షరం యు ఉంటుంది. అలా విడివిడిగా బైక్స్ పై వెళ్లిన ఆ ముగ్గురు ఒక చోట కలుస్తారు..ఐ లవ్ యు అర్థం వచ్చేలా ఫార్మ్ అయ్యి జంటగా ఉన్న బైక్ ముందు వెళ్తుంటారు. ఆ వెంటనే మరో యువకుడు బైక్ పై వచ్చి..అమ్మాయితో బైక్ పై వెళుతున్న అబ్బాయి చేతికి పూల బొకే అందిస్తాడు. ఏంటి ఇదంతా అని అమ్మాయి షాక్ లో ఉండగానే...అందరూ ఒక చోట ఆగగానే...ప్రియుడు తన ప్రియురాలికి పూలబొకే ఇచ్చి తన లవ్ ను ప్రపోజ్ చేస్తాడు..ఇక స్నేహితులు క్రాకర్స్ కాల్చుతూ వారికి కంగ్రాట్స్ చెబుతుంటారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
ఈ వీడియోని చూసి ప్రియుడు తన ప్రియురాలికి చాలా వెరైటీగా ప్రపోజ్ చేశాడంటూ నెటిజన్స్ ఫిదా ఔతున్నారు. కొంతమంది అబ్బాయిలు అయితే తాము కూడా తమ గాళ్ ఫ్రెండ్ కి ఇలానే ప్రపోజ్ చేస్తామంటూ కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికి ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునే సమయంలో ఫ్రెండ్స్ తోడుగా నిలబడడం మనకు తెలిసిందే..ఇప్పుడు లవ్ ప్రపోజ్ సందర్భంలోనూ స్నేహితులు అండగా నిలబడుతున్నారు.