పేదల అకౌంట్లలో 611కోట్లు జమ చేసిన యోగి సర్కార్

కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశంలో వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Update: 2020-03-30 16:28 GMT

కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశంలో వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 25 మంది మృతి చెందారు. అయితే దీనిని అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ శక్తికి మించి ప్రయత్నిస్తున్నాయి. ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ విధించడంతో పలు రాష్ట్ర ప్రభుత్వాలు పేద కార్మికుల ఆకలి కోసం ఉచిత రేషన్ బియ్యం తో సహా నగదును ఇస్తున్నట్లు ప్రకటించాయి..

అందులోభాగంగా ఉత్తరప్రదేశ్లోని యోగి సర్కార్ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్కీమ్ కింద రూ.1000 అందజేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.. ఇచ్చిన హామీ ప్రకారం యోగి ఆదిత్యనాథ్ స్వయంగా రూ.611కోట్ల రూపాయలను పేద కూలీల ఖాతాలకు ట్రాన్స్‌ఫర్ చేశారు. సుమారు 27.5 లక్షలమంది ఖాతాల్లో ఈ సొమ్ము జమ చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా కూలీలతో మాట్లాడుతూ ప్రభుత్వం ఎప్పటికీ అండగా ఉంటుందని పేర్కొన్నారు.. ఇక ఉత్తరప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 75 కి చేరింది.


Tags:    

Similar News