UPSC: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్ధులకు గుడ్ న్యూస్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష 2025 తోపాటు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కు సంబంధించిన పరీక్ష నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అఖిల భారత సర్వీసుల్లో దాదాపు 979 పోస్టుల భర్తీ కోసం సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2025 పరీక్షకు యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ సారి అన్ని సర్వీసులకు కేవలం 979 ఖాళీలు మాత్రమే ఉన్నాయి. గతేడాది భర్తీ చేసిన 1056 పోస్టులతో పోల్చితే ఇప్పుడు 77 పోస్టులు తక్కువ.
యూపీఎస్సీ సీఎస్ ఈ 2025 పరీక్షలకు జనవరి 22 నుంచి ఫిబ్రవరి 11 వ తేదీ సాయంత్రం 6గంటల వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ప్రిలిమినరీ పరీక్ష మే 25న జరుగుతుంది. మరోవైపు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ లో మరో 150 పోస్టులకు విడిగా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ ఎగ్జామ్ కు కూడా ఫిబ్రవరి 11 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అభ్యర్థులు నోటిఫికేషన్ కు సంబంధించి మరిన్ని వివరాలను ఎప్పటికప్పుడు అధికారిక వెబ్ సైట్ https://upsc.gov.in/లో తెలుసుకోవచ్చు.