Union Budget 2026: జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. ఫిబ్రవరి 1న నిర్మలమ్మ బడ్జెట్!
Union Budget 2026: ఈనెల 31న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
Union Budget 2026: ఈనెల 31న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు పార్లమెంట్ ఉభయ సభలు సమావేశమవుతాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ సమావేశాల్లో ప్రభుత్వం కొన్ని కీలక బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే విధానం వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు, 30 రోజులు జైల్లో ఉంటే సీఎం, మంత్రులలు పదవుల నుంచి తొలగించే బిల్లులపై చర్చ జరగనుంది.