Turkman Gate Demolition: ఆపరేషన్ బుల్డోజర్.. ఢిల్లీలోని పాతబస్తీ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం
Turkman Gate Demolition: దేశ రాజధాని పాత ఢిల్లీలోని తుర్క్ మాన్ గేట్ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
Turkman Gate Demolition: ఆపరేషన్ బుల్డోజర్.. ఢిల్లీలోని పాతబస్తీ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం
Turkman Gate Demolition: దేశ రాజధాని పాత ఢిల్లీలోని తుర్క్ మాన్ గేట్ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఫైజ్-ఏ-ఇలాహీ మసీదు సమీపంలోని ఆక్రమణలను తొలగించేందుకు.. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఆపరేషన్‌ను చేట్టింది. అయితే ఆక్రమణల తొలగింపును అడ్డుకునేందుకు కొందరు దుండగులు0 పోలీసులపైకి రాళ్లు రువ్వారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు బాష్పవాయువును ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు.
రామ్ లీలా మైదాన్ పక్కనే ఉన్న మసీదు, శ్మశాన వాటికకు ఆనుకుని ఉన్న సుమారు 38 వేల 940 చదరపు అడుగుల భూమిలో అక్రమ కట్టడాలు ఉన్నాయి. అయితే ఢిల్లీ హైకోర్టు గతేడాది నవంబర్‌లో అక్కడున్న అక్రమ కట్టడాలను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. రోడ్లు, ఫుట్‌పాత్‌లు, కమ్యూనిటీ హాల్, ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్ వంటివి ఆక్రమణల పరిధిలో ఉన్నాయని అధికారులు గుర్తించారు. దీనిపై మసీదు కమిటీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పటికీ కోర్టు స్టే ఇవ్వకపోవడంతో ఎంసీడీ అధికారులు 17 బుల్డోజర్లతో రంగంలోకి దిగారు.
శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఈ ప్రాంతాన్ని తొమ్మిది జోన్లుగా విభజించి భారీగా పోలీసులను మోహరించారు. రాత్రి ఒంటి గంటకు ప్రారంభమైన ఈ ఆపరేషన్‌లో రాళ్ల దాడి కారణంగా ఐదుగురు పోలీసు అధికారులు స్వల్పంగా గాయపడ్డారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ పోలీస్ కమిషనర్ మధుర్ వర్మ తెలిపారు. మసీదు కమిటీ మాత్రం ఈ భూమి వక్ఫ్ బోర్డు పరిధిలోకి వస్తుందని, తాము లీజు చెల్లిస్తున్నామని వాదిస్తోంది.
కూల్చివేతల నేపథ్యంలో పాత ఢిల్లీ పరిసరాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. జేఎల్ఎన్ మార్గ్, అజ్మీరీ గేట్, మింటో రోడ్, ఢిల్లీ గేట్ ప్రాంతాల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కమలా మార్కెట్ నుంచి అసఫ్ అలీ రోడ్ వైపు వెళ్లే మార్గాలను తాత్కాలికంగా మూసివేసినట్లు అధికారులు వెల్లడించారు. అత్యవసరమైతే తప్ప ఈ మార్గాల్లో ప్రయాణించవద్దని ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు.