పశ్చిమ బెంగాల్‌లో రైలు ప్రమాదం.. లూప్‌లైన్‌లో ఉన్న గూడ్స్‌ను ఢీకొన్న మరో గూడ్స్ రైలు

Train Accident: ప్రమాదంలో పట్టాలు తప్పిన 12 బోగీలు

Update: 2023-06-25 03:45 GMT

పశ్చిమ బెంగాల్‌లో రైలు ప్రమాదం.. లూప్‌లైన్‌లో ఉన్న గూడ్స్‌ను ఢీకొన్న మరో గూడ్స్ రైలు

Train Accident: రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం మరోసారి బయటపడింది. బాలాసోర్ రైలు ప్రమాద ఘటన కళ్లముందు కదలాడుతుండగానే సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం కారణంగా మరో రైలు పట్టాలు తప్పింది. పశ్చిమ బెంగాల్‌‌లోని బంకురా సమీపంలో లూప్‌ లైన్‌లో ఉన్న గూడ్స్ రైలును మరో గూడ్స్ రైలు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 12 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో లోకో పైలట్‌కు తీవ్రగాయాలయ్యాయి.

లూప్ లైన్‌లో ఒక ట్రైన్ ఉంటే అదే ట్రాక్‌పైకి మరో రైలు ఎందుకు వస్తుంది..? అదే పరిస్థితి ఎందుకు పునరావృతం అవుతుంది...? బాలాసోర్ లాగానే ఇప్పుడు సైతం ప్యాసింజర్ ట్రైన్ లైప్ లైన్‌లోకి వస్తే పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాల కారణంగా ఇప్పుడు రైలు ప్రయాణ భద్రతపై నీలినీడలు కమ్మకుంటున్నాయి.

Tags:    

Similar News