మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో పులి సంచారం
Maharashtra: పులి సంచారంతో భయాందోళనకు గురైతున్న ప్రజలు
మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో పులి సంచారం
Maharashtra: మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో పులి సంచారం ప్రజలను మరోసారి కలవర పెడుతోంది. పులి సంచారంతో ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో ప్రజలు భయాందోళనకు గురైతున్నారు. మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో రాత్రి రోడ్ల వెంట పులి నడుస్తూ ఓ లారీ డ్రైవర్ కంట పడింది. సదరు డ్రైవర్ పులి కదలిక దృశ్యాలను చిత్రీకరించడం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. భీంపూర్ మండలంలోని గ్రామాలను అటవీశాఖ అధికారులు అప్రమత్తం చేశారు. నదిలో ప్రవాహ ఉద్ధృతి తగ్గడం, ఆవాసం కోసం పులులు మండలంలో ఆయా గ్రామాల అటవీ ప్రాంతంలో అడుగుపెట్టడం పరిపాటిగా మారింది. అటవీ అధికారులు బేస్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.