Mumbai: వీడొక్కడే మూవీ సీన్ తరహాలో డ్రగ్స్ సరఫరా
Mumbai: పొట్టలో రూ.5 కోట్ల విలువైన డ్రగ్ క్యాప్సూల్స్
Mumbai: వీడొక్కడే మూవీ సీన్ తరహాలో డ్రగ్స్ సరఫరా
Mumbai: ఇండియా ఎయిర్‌పోర్టులలో డ్రగ్స్ పట్టివేత కేసులు పెరుగుతూ ఉన్నాయి. అధికారులు డ్రగ్స్ సరఫరాను అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటున్నా.. రోజుకో తీరులో డ్రగ్స్ తరలిస్తూ ఛాలెంజ్ విసురుతూనే ఉన్నారు స్మగ్లర్లు. ఇటీవల ముంబై ఎయిర్ పోర్టును అడ్డాగా చేసుకుని డ్రగ్స్ తరలిస్తున్న ఘటనలు తరచుగా వెలుగుచూస్తున్నాయి. ఇటీవల ఓ వ్యక్తి వీడొక్కడే మూవీ తరహాలో 5 కోట్ల విలువైన డ్రగ్స్ తరలిస్తూ పట్టుబడ్డాడు.
ఆఫ్రికా దేశానికి చెందిన ఓ వ్యక్తి నుంచి ముంబై ఎయిర్‌పోర్టులోని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు 5 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. జూన్ 21న ముంబై ఎయిర్‌పోర్ట్‌లో బెనిన్ దేశానికి చెందిన ఓ వ్యక్తి అక్రమంగా డ్రగ్స్ తరలిస్తున్నాడని డీఆర్‌ఐ అధికా రులకు సమాచారం అందింది. దీంతో అతనిని ఆపి తనిఖీ చేయగా, పొట్టలో డ్రగ్స్ క్యాప్యూల్స్ ఉన్నట్లు గుర్తించారు. దీంతో అతన్ని అదుపు లోకి తీసుకొని, కోర్టులో హాజరు పర్చగా, నిందితుడికి వైద్య పరీక్షలు చేసి, క్యాప్యూల్స్ బయటకు తీయాలని ఆదేశించింది. దీంతో ఆ వ్యక్తి కడుపులో నుంచి 43 హెరాయిన్ క్యాప్యూల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు అధికారులు.