భువనేశ్వర్ లో రోబో రెస్టారెంట్

ఇప్పటి వరకు రోబోలు రెస్టారెంట్లో ఆహారాన్ని కస్టమర్లకు అందించడం సినిమాల్లో మాత్రమే చూసాం. కాని ఇప్పుడు నిజ జీవితంలోను రోబోలు హోటల్లో కస్టమర్లకు ఆహారాన్ని అందిస్తున్నాయి.

Update: 2019-10-17 10:28 GMT

ఇప్పటి వరకు రోబోలు రెస్టారెంట్లో ఆహారాన్ని కస్టమర్లకు అందించడం సినిమాల్లో మాత్రమే చూసాం. కాని ఇప్పుడు నిజ జీవితంలోను రోబోలు హోటల్లో కస్టమర్లకు ఆహారాన్ని అందిస్తున్నాయి.

ఒడిశాలోని భువనేశ్వర్ లో ఓ ప్రముఖ హోటల్ లో రెండు రోబో చెఫ్ లను ఏర్పాటు చేసారు. భారత్‌లో తయారైన ఈ రోబోలకు చంపా, చమేలీ అనే పేర్లు పెట్టారు. ఈ 'రోబో చెఫ్‌లు కస్టమర్లకు ఆహార పదార్థాలను అందించి కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ఒడిశాలో రోబోలతో సర్వ్‌ చేయిస్తున్న తొలి హోటల్‌ తమదేనని హోటల్ యజమాని జీత్‌బాషా చెప్పారు. ఆత్యాధునిక సాంకేతికత ఆధారంగా పనిచేస్తున్న ఈ రోబోలు కస్టమర్ల ఆదేశాలకు అనుగుణంగా ఆహారాన్ని అందిస్తున్నాయి. ఈ రోబోలు  కేవలం ఇంగ్లీష్ మాత్రమే కాకుండా భారత దేశంలోని పలు భారతీయ భాషాల్లో కూడా ఇవి మాట్లడగలవని నిర్వాహకులు తెలిపారు.

Tags:    

Similar News