జమ్మూకశ్మీర్‌లో ఎదురుకాల్పులు

Update: 2019-08-03 03:51 GMT

జమ్మూకశ్మీర్‌లో మరో ఎన్‌కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులకు, ఆర్మీ జవాన్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. సోపోరీ మల్మాపన్ పురా ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే సమాచారంతో సైనికులు సోదాలు మొదలు పెట్టారు. సోదాలు చేస్తున్న జవాన్లపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆర్మీ జవాన్లు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో ఓ ఉగ్రవాదిని సైనికులు అంతమొందించారు. అలాగే ఓ జవానుకి తీవ్ర గాయాలయ్యాయి. ముష్కరులు ఇంకా నక్కి ఉండడంతో ఎదురుకాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి.

Tags:    

Similar News