Mrs India: మిసెస్‌ ఇండియా పోటీల్లో మెరిసిన తెలంగాణ మహిళ... తొలిసారిగా రికార్డు

Mrs India: దేశవ్యాప్తంగా ఫైనల్లో తలపడిన 50 మంది మహిళలు

Update: 2023-02-09 02:18 GMT

Mrs India: మిసెస్‌ ఇండియా పోటీల్లో మెరిసిన తెలంగాణ మహిళ... తొలిసారిగా రికార్డు

Mrs India: పెళ్లైన తర్వాత మహిళలు వంటింటికే పరిమితం గాకుండా కృషిచేస్తే అనూహ్యఫలితాలను సొంతంచేసుకోవచ్చని తెలంగాణకు చెందిన కిరణ్మయి అలివేలు నిరూపించింది. అందాల పోటీల్లో తొలిసారిగా తెలంగాణ మహిళ మెరిసింది. మిసెస్ ఇండియా 2023 పోటీల్లో తెలంగాణకు చెందిన కిరణ్మయి అలివేలు రన్నరప్ గా నిలిచింది. సామాజిక అవగాహ‍న, వ్యక్తిత్వవికాసంతో అందాలపోటీల్లో పాల్గొని గట్టిపోటీనిచ్చి రన్ రప్‌గా నిలిచారు. రాజస్థాన్ వేదికగా జరిగిన పోటీల్లో ఆమె కీలక పోటీదారుగా ప్రతిభను కనబరచారు. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి ఎంపికైన వారిలో 50 మంది ఫైనల్ కు చేరుకోగా తుది పోటీల్లో చక్కని ప్రదర్శనతో కిరణ్మయి రెండో స్థానంలో నిలిచారు. అందాల పోటీల్లో తొలిసారిగా తెలంగాణ మహిళ మెరిసింది. పది కేటగిరీల్లో 30 మంది పోటీపడ్డారు. టాలెంట్ రౌండ్, డాన్స్ రౌండ్, సఫారి రౌండ్, ఫ్యాషన్ రౌండ్‌లో పోటీనిచ్చిన కిరణ్మయి, గతంలో2019 మిసెస్ ఇండియా తెలంగాణ ఎట్రాక్టివ్ టైటిల్ గెలిచారు. మిసెస్ ఇండియా తెలంగాణ రీజినల్ డైరెక్టర మిసెస్ మమతా త్రివేది కిరణ్మయికి మెంటర్ గా వ్యవహరించారు. ఇదే పోటీల్లో డైరెక్టర్ కేటగిరీలో మమతా త్రివేది బెస్ట్ డైరెక్టర్ అవార్డును సొంతం చేసుకున్నారు.

Tags:    

Similar News