ఢిల్లీ : రిపబ్లిక్ డే వేడుకల్లో తెలంగాణ శకటం ప్రత్యేక ఆకర్షణ

Update: 2020-01-26 06:14 GMT
రిపబ్లిక్ డే వేడుకల్లో తెలంగాణ శకటం ప్రత్యేక ఆకర్షణ

రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా ఢిల్లీలోని రాజ్ పథ్ దగ్గర నిర్వహించిన పరేడ్ లో తెలంగాణ శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా నిలిచే బతుకమ్మ పండుగ, మేడారం సమ్మక్క-సారాలమ్మ జాతర, వెయ్యి స్థంభాల గుడి థీమ్ తో రూపొందించిన ఈ శకటం అందరి దృష్టిని ఆకర్షించింది.

గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను చాటి చెప్పేలా గొండి, తోటి, ప్రదాన్‌, కొమ్ముకోయ, బంజారా కళాకారుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్వరాష్ట్రం సిద్దించాక 2015 లో తొలిసారి తెలంగాణ తరఫున శకటం ప్రదర్శించే అవకాశం రాష్ట్రానికి దక్కింది. ఐదేండ్ల తర్వాత మరోసారి తెలంగాణ శకటం ప్రదర్శించబడింది. 

Tags:    

Similar News