సుప్రీంకోర్టు తీర్పులు ఇక తెలుగులో కూడా..

Update: 2019-07-17 16:47 GMT

సుప్రీంకోర్టు ముఖ్యమైన తీర్పులు ఇకపై ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి రానున్నాయి. సుప్రీంకోర్టు 100 కీలక తీర్పులను ప్రాంతీయ భాషల్లోకి అనువదించి నేడు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా విడుదల చేశారు. సుప్రీంకోర్టు అదనపు భవన సముదాయాన్ని రాష్ట్రపతి ఇవాళ ప్రారంభించారు. 12 ఎకరాల్లో 6 బ్లాకులుగా అదనపు భవనాల నిర్మాణం జరిగింది.

హిందీతో పాటు మరో 5 ప్రాంతీయ భాషలు తెలుగు, అస్సామీ, కన్నడ, మరాఠీ, ఒరియా ప్రాంతీయ భాషల్లో తీర్పులు వెలువడనున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ కుమార్ దోవల్, త్రివిధ దళాధిపతులు, న్యాయశాఖమంత్రి రవిశంకర్ ప్రసాద్, పలువురు న్యాయమూర్తులు, సీనియర్ న్యాయవాదులు హాజరయ్యారు.


Tags:    

Similar News