సూర్యగ్రహణం: వీళ్ల ఛాదస్తం పాడుగానూ..!

ప్రపంచవ్యాప్తంగా గురువారం ఉదయం 8 గంటల 8 నిమిషాలకు ప్రారంభమైన సూర్యగ్రహణం..11 గంటల11నిమిషాలకు వీడింది.

Update: 2019-12-26 07:46 GMT

ప్రపంచవ్యాప్తంగా గురువారం ఉదయం 8 గంటల 8 నిమిషాలకు ప్రారంభమైన సూర్యగ్రహణం..11 గంటల11నిమిషాలకు వీడింది. మూలా నక్షత్రం ధనుస్సు రాశిలో ఈ సూర్యగ్రహణం ఏర్పడింది. ఈ సూర్యగ్రహణాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ ఆసక్తిగా వీక్షించారు. గ్రహణం కారణంగా బుధవారం సాయత్రం నుంచే ఆలయాలన్నీ మూసేసారు. ఇలా ఆలయాలను మూసేయడం, గ్రహణ కాలంలో ఆహారం పదార్థాలపైన దర్భను ఉంచడం పురాతన కాలం నుంచి వస్తున్న ఆచారమే.

ఇదిలా ఉంటే కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు గ్రహణ సమయంలో ఎక్కడా లేని వించ ఆచారాలను పాటించారు. కొన్ని ప్రాంతాల్లో జిల్లేడు చెట్లకు తాయెత్తులు కట్టడం, రోకళ్లను నిలబెట్టడం లాంటి ఆచారాలను పాటిస్తే కొన్ని చోట్ల మాత్రం పాత నమ్మకాల పేరుతో పసిపిల్లల ప్రాణాలను చిక్కుల్లో పెడుతున్నారు. సూర్యగ్రహణం రోజు పిల్లలను పాతిపెడితే అంగవైకల్యం పోతుందని నమ్మి అంతకూ తెగిస్తున్నారు. ఈ ఆచారాలకు పసిపిల్లల ప్రాణాలను పనంగా పెడుతున్నారు.

ఈ వింత సంఘటన గురించిన పూర్తి వివరాల్లోకెలితే కర్ణాటకలోని విజయ్‌పూర్ జిల్లా అర్జునగి పీకే గ్రామంలో ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది. సూర్యగ్రహణం రోజున పిల్లలను పాతిపెడితే అంగవైకల్యం పోతుందని అక్కడి ప్రజల నమ్మకం. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లల్ని మెడ వరకు నేలలో పాతిపెట్టారు. గ్రహణం మొదలయిన సమయం నుంచి విడిచే వరకూ పాపం ఆ పిల్లలు భూమిలోనే ఉండిపోయారు. అలాంటి పరిస్థితుల్లో భూమిలోపల ఏమైనా విష పురుగులు పిల్లలను కుడితే అది ఆ పిల్లల ప్రాణాలకే ప్రమాదం అని ఆలోచించలేక పోయారు మూఢ నమ్మకాలను నమ్మిన తల్లిదండ్రులు.

ఈ విషయంపైన జనవిజ్ఞాన వేదిక సభ్యులు స్పందిస్తూ ఇది మూర్ఖత్వపు చర్య అని మండిపడుతున్నారు. నేలలో ఇలా పాత పెడిట్టినంత మాత్రాన అంగవైకల్యం పోతుందా అని ప్రశ్నిస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే అనంతపురం జిల్లాలో మహిళ సూర్యగ్రహణం కారణంగా వింత ఆచారాలను పాటిస్తున్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో గ్రహణం రోజు గ్రామానికి అరిష్టం జరగకూడదని మహిళల ప్రత్యేక పూజలు చేశారు. జిల్లేడు చెట్లకు తాయెత్తులు కట్టారు. ఏదిఏమైతే నేం మొత్తం మీద కొందరు ఎవరి పిచ్చి వారికానందం అన్నట్టు తమ, తమ వింత ఆచారాలను పాటిస్తూ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తున్నారు. 

Tags:    

Similar News