Sonia Gandhi: ఆసుపత్రిలో చేరిన కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ

Update: 2025-02-21 01:22 GMT

Sonia Gandhi: మరోసారి ఆసుపత్రిలో చేరిన సోనియాగాంధీ..ఆందోళనలో కాంగ్రెస్ శ్రేణులు..!

Sonia Gandhi: కాంగ్రెస్ అగ్రనాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు సోనియాగాంధీ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. సర్ గంగారం ఆసుపత్రిలో చేరారు. పొత్తికడుపు సంబంధిత సమస్యలత ఆమె గురువారం ఉదయం ఆసుపత్రిలో చేరినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆమె ఆరోగ్యం బాగానే ఉందని శుక్రవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యే అవకాశం ఉన్నట్లు సర్ గంగారాం ఆసుపత్రి బోర్డ్ ఆఫ్ మేనేజ్ మెంట్ చైర్మన్ అజయ్ స్వరూప్ తెలిపారు. గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణుడు డాక్టర్ సమీరన్ నందీ రాజ్యసభ సభ్యురాలి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారన్నారు. గత ఏడాది డిసెంబర్ నెలలో సోనియా 78వ పడిలోకి ప్రవేశించారు. 

Tags:    

Similar News