Bengal: హుగ్లీలోని రిష్రా లో 144 సెక్షన్ విధింపు
Bengal: పశ్చిమ బెంగాల్‌లో కొనసాగుతున్న హై టెన్షన్
Bengal: హుగ్లీలోని రిష్రా లో 144 సెక్షన్ విధింపు
Bengal: పశ్చిమ బెంగాల్ హుగ్లీ జిల్లా రిష్రాలో శాంతి భద్రతలు క్షీణించడంతో 144 సెక్షన్ విధించారు. ఇంటర్ నెట్ సర్వీసులను నిలిపివేశారు. . శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా జరిగిన శోభాయాత్ర పై ఓ వర్గం వారు రాళ్లు రువ్వడంతో అల్లర్లు చెలరేగాయి. దీంతో అల్లర్ల ను అరికట్టేందుకు బెంగాల్ ప్రభుత్వం 144 సెక్షన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దుకాణాలు కూడా మూత పడ్డాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని టెన్షన్ వాతావరణం నెలకొన్నది. రిష్రా ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు.