పరువు నష్టం కేసులో న్యాయపోరాటానికి సిద్ధమైన రాహుల్‌గాంధీ
* నేడు సూరత్ సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్న రాహుల్‌గాంధీ
పరువు నష్టం కేసులో న్యాయపోరాటానికి సిద్ధమైన రాహుల్‌గాంధీ
Rahul Gandhi: పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. నేడు సూరత్ సెషన్స్ కోర్టులో రాహుల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. మేజిస్ట్రేట్ కోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని కోరనున్నారు. తన పిటిషన్‌పై తీర్పు వచ్చే వరకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని రాహుల్ అభ్యర్థించనున్నారు. ప్రధాని మోడీ ఇంటి పేరును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల పరువు నష్టం కేసులో.. రాహుల్‌కు సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే ఎంపీగా అనర్హత వేటు, అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాలనే ఆదేశాలపై కూడా న్యాయపరంగా ఎదుర్కొనేందుకు రాహుల్ ప్రణాళికలు రూపొందిస్తున్నారు.