బిగ్ బ్రేకింగ్ : కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం..

Update: 2019-01-23 07:51 GMT

సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్ సంచలన నిర్ణయం తీసుకుంది.సోనియా కుమర్తె, రాహుల్ గాంధీ చెల్లెలు ప్రియాంక గాంధీని ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర తూర్పు ప్రాంతానికి జనరల్ సెక్రటరీగా నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది AICC (ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ). ఈ మేరకు జ్యోతిరాదిత్య సింధియా ప్రకటన విడుదల చేశారు. దీంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక వచ్చేసినట్టు కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ హవాను తగ్గించడానికి…

కాంగ్రెస్ కు ప్రజాధారణ పెంచడానికి వీలుగా అధిష్టానం వ్యూహం రచించింది. ఇందులో భాగంగా ప్రియాంకకు కీలక పదవి కట్టబెట్టింది. కాగా 2019 ఫిబ్రవరి మొదటి వారంలో బాధ్యతలు తీసుకోనున్నారు ప్రియాంక.ఇప్పటి వరకు తల్లి సోనియా, అన్నయ్య రాహుల్ గాంధీ నియోజకవర్గాలు అయిన రాయబరేలి, అమేధి లోక్ సభ నియోజకవర్గాల్లో ప్రచారం మాత్రమే చేస్తున్నారు. 

Similar News