అన్ని ప్రయివేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లు ఉచితంగా ఇవ్వాల్సిందే!

Update: 2019-07-02 07:42 GMT

దేశంలోని అన్ని ప్రైవేట్, ప్రత్యేక కేటగిరీ పాఠశాలల్లో 25 శాతం సీట్లను బలహీన వర్గాల వారి పిల్లలకు కేటాయించాలని కేంద్రం రాష్ట్రాలకు స్పష్టం చేసింది. బాలలకు ఉచిత, నిర్బంధ విద్య చట్టం–2010 ప్రకారం..ప్రాథమికోన్నత స్థాయి విద్య 6–14 ఏళ్ల మధ్య పిల్లలందరి ప్రాథమిక హక్కని తెలిపింది.

మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్‌ పొఖ్రియాల్‌ నిశాంక్‌ లోక్‌సభలో మాట్లాడుతూ.. అన్ని ప్రైవేట్‌ ఎయిడెడ్, అన్‌ ఎయిడెడ్, స్పెషల్‌ కేటగిరీ పాఠశాలల్లో ఒకటి, అంతకంటే తక్కువ తరగతులకు చేపట్టే ప్రవేశాల్లో ఆ తరగతిలోని కనీసం 25 శాతం సీట్లను బలహీన, వెనుకబడిన వర్గాల వారి పిల్లలకు ఇవ్వాలి. ఆ తరగతి పూర్తయ్యే వరకు వారికి ఉచితంగా విద్య అందించాలి' అని ఆయన కోరారు. 'ఆ చిన్నారుల కయ్యే ఖర్చును ప్రభుత్వమే చెల్లిస్తుంది. రాష్ట్రం నిర్ణయించిన ఫీజు ప్రకారం, లేదా వాస్తవంగా ఒక్కో చిన్నారి నుంచి వసూలు చేసే ఫీజు.. ఏది తక్కువైతే అందుకు సరిసమానమైన మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది' అని తెలిపారు. ప్రభుత్వం నుంచి భూమి, వసతి, పరికరాలను ఉచితంగా గానీ లేదా తక్కువ ధరకుగానీ పొంది 25 శాతం మంది చిన్నారులకు రిజర్వేషన్‌ ప్రకారం ఉచిత విద్య అందిస్తున్న పాఠశాలలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఉండదని తెలిపారు.   

Tags:    

Similar News