Yoga Day 2020: ఇంట్లోనే ఉండండి..ప్రాణాయామం చేయండి.. ప్రధాని మోడీ

Update: 2020-06-21 03:18 GMT
Narendra Modi

ఈ రోజు ప్రపంచ యోగ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దేశప్రజలందరూ రోజు ప్రాణాయం చేసి ఆరోగ్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. దీనిని చేయడం వల్ల ఎన్నో లాభాలున్నాయని తెలిపారు. మానసిక ఒత్తిడి, రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. ప్రస్తుతం ఉన్న కరోనా నేపథ్యంలో ఇంట్లోనే యోగా..ఫ్యామిలతో యోగా పిలుపునివ్వడం జరిగిందన్నారు.

ఇతర కార్యక్రమాలకు దూరంగా ఉంటూ కుటుంబసభ్యులతో యోగా చేయాలని పిలుపునిచ్చారు. కుటుంబంతో యోగా చేయడం వల్ల..ఎన్నో సత్ఫలితాలు ఇస్తుందన్నారు. రోగ నిరోధక శక్తి కరెక్టుగా ఉంటే..కరోనాను దూరం చేయవచ్చని, ఇందుకు యోగాలో కొన్ని ఆసనాలు ఉన్నాయన్నారు. ప్రాణమాయం ఇందుకు చక్కటి పరిష్కారమని, ప్రతి రోజు దీనిని చేయడం వల్ల..ఎన్నో లాభాలు కలుగుతాయని తెలిపారు. యోగా కేవలం..ఒక్క రోజు మాత్రమే చేయవద్దని, రోజులో భాగం చేయాలని సూచించారు.





Tags:    

Similar News