ఆ బిచ్చగాడు లక్షాధికారి!

Update: 2019-10-07 10:25 GMT

బిచ్చమెత్తుకుని జీవిస్తున్నాడని తక్కువ అంచనా వేయక్కర్లేదనిపిస్తుంది కొన్ని సంఘటనలు వింటే. ఇటీవల కాలంలో పలు సంఘటనలు యాచకత్వం ఎంత సంపన్నమైన వృత్తి గా మారిపోయిందో కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నాయి. ఆ కోవలో ఇప్పుడు ముంబై లో మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. యాచక వృత్తిలో ఉన్న ఓ వృద్ధుడు శుక్రవారం పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టి చనిపోయాడు. ఇతడిని ముంబయి వేదుల్లో బిచ్చమెత్తుకునే బిర్భిచంద్‌ అజాద్‌ (62) గా గుర్తించారు. పోలీసులు అతని వివరాలు సేకరించే క్రమంలో అతని చేతి సంచి చూసి నోళ్ళు వెల్లబెట్టారు. అందులో వారికి లక్షా 77 వేల రూపాయల నగదు దొరికింది. ఆ చిల్లర లెక్కపెట్టడానికి పోలీసులకు 8 గంటల సమయం పట్టింది.

అటుతర్వాత వారు అతని గురించిన్ వివరాలు సేకరిస్తుండగా అతని బ్యాంక్ ఎకౌంట్లలో 8 లక్షల 77 వేల రూపాయలు ఫిక్స్ డిపాజిట్లు ఉన్నట్టు గుర్తించి ఆశ్చర్యపోయారు. అంతే కాదు అతని వద్ద పాన్ కార్డ్, అదార్ కార్డ్, సీనియర్ సిటిజన్ కార్డ్ కూడా ఉండడం చూసిన పోలీసులకు మతి పోయిందట. ఇతని స్వస్థలం రాజస్థాన్ గా గుర్తించిన పోలీసులు అతని కుటుంబ సభ్యుల కోసం ఆరా తీసేపనిలో ఉన్నారు.


Tags:    

Similar News