Haryana: హర్యానా నూహ్‌లో కొనసాగుతున్న పోలీస్ ఆంక్షలు.. అక్రమ నిర్మాణాల కూల్చివేత
Haryana: 144 సెక్షన్ అమలు, భారీగా పోలీసుల మోహరింపు
Haryana: హర్యానా నూహ్‌లో కొనసాగుతున్న పోలీస్ ఆంక్షలు.. అక్రమ నిర్మాణాల కూల్చివేత
Haryana: హర్యానా నూహ్‌లో పోలీస్ ఆక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. 144సెక్షన్ ఇంకా అమల్లోనే ఉంది. భారీగా పోలీసులు మోహరించారు. ప్రజలకు నిత్యావసరాల కోసం మధ్యాహ్నం 12గంటల నుంచి 3గంటల వరకు కర్ఫ్యూ సడలించారు. అల్లర్లలో ప్రమేయం ఉన్న వ్యక్తులకు చెందిన అక్రమ నిర్మాణాల కూల్చివే కొనసాగుతూనే ఉంది. నల్హర్ వైద్య కళాశాల చుట్టూ ఉన్న నిర్మాణాలను అధికారులు బుల్డోజర్లతో కూల్చి వేశారు. మొత్తం 15 తాత్కాలిక నిర్మాణాలను నేలమట్టం చేశారు. తౌరులో 250 గుడిసెలను అధికారులు తొలగించారు. ఇప్పటి వరకు 104 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి 216మందిని అరెస్ట్ చేశారు.