విశాఖ ఘటనపై ప్రధాని అత్యవసర సమావేశం

Update: 2020-05-07 06:59 GMT

విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటనపై కేంద్ర విపత్తు నిర్వహణ శాఖతో ప్రధాని నరేంద్ర మోదీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీకి సంబంధించిన ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. వీరితో పాటు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, హోంమంత్రి అమిత్‌షా తదితరులు పాల్గొన్నారు.

ఘటన నేపథ్యంలో తీసుకుంటోన్న చర్యలపై సమీక్షించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. కాగా, గురువారం తెల్లవారుజామున ఆర్‌ఆర్‌ వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమలో రసాయన వాయువు లీకైంది. ఈ ఘటనలో ఏడుగురు మృతిచెందగా.. దాదాపు 200 మంది అస్వస్థతకు గురయ్యారు.

Tags:    

Similar News