Namo Bharat: తొలి ర్యాపిడ్ రైలు ‘నమో భారత్’ను ప్రారంభించిన మోదీ
Namo Bharat: ఢిల్లీ-ఘజియాబాద్ మధ్య నడవనున్న నమో రైలు
Namo Bharat: తొలి ర్యాపిడ్ రైలు ‘నమో భారత్’ను ప్రారంభించిన మోదీ
Namo Bharat: దేశంలోనే తొలిసారిగా హై స్పీడ్ రైలును ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లోని సాహిబాబాద్ స్టేషన్‌లో కొత్త రైల్ సర్వీస్‌ను మోడీ ప్రారంభించారు. ప్రధాని జెండా ఊపి ప్రారంభించిన ర్యాపిడ్ ఎక్స్ రైలు ఢిల్లీ-ఘజియాబాద్ మధ్య పరుగులు పెట్టనుంది. రైలును ప్రారంభించిన తర్వాత సీఎం యోగీ, గవర్నర్ ఆనందీబెన్ పటేల్ తో కలిసి ప్రధాని మోడీ రైలులో ప్రయాణించారు.
గంటకు 180 కి.మీ.గరిష్ఠ వేగంతో పరుగులు పెట్టే ఈ రైలులో అధునాతన సౌకర్యాలు కల్పించారు. దిల్లీ- గాజియాబాద్- మేరఠ్ మధ్య రూ.30వేల కోట్లతో చేపట్టిన రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ కారిడార్‌లో సాహిబాబాద్-దుహై డిపో మధ్య ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది. ఈ రెండింటి మధ్య అయిదు స్టేషన్లు ఉంటాయి.
నమోభారత్ రైళ్లలో అన్నీ ఏసీ కోచ్‌లే ఉంటాయి. ప్రతి రైలులో 2+2 సీట్లు, నిలబడేందుకు విశాలమైన ప్రదేశం, లగేజీ పెట్టేందుకు ప్రత్యేక కప్‌బోర్డ్, సీసీటీవీ కెమెరాలు, ఎమర్జెన్సీ ఎగ్జిట్, లాప్‌టాప్, మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు, రూట్‌మ్యాప్‌లు, ఆటోమేటిక్ లైటింగ్ వ్యవస్థలు హైలెట్ గా ఉన్నాయి. నమో రైళ్లు ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు పావుగంటకు ఒకటి చొప్పున నడుస్తాయి.