రన్నింగ్‌ ట్రైన్‌లో మహిళకు నిప్పంటించిన దుండగుడు

* కాపాడేందుకు యత్నించిన 8 మందికి గాయాలు

Update: 2023-04-03 03:16 GMT

రన్నింగ్‌ ట్రైన్‌లో మహిళకు నిప్పంటించిన దుండగుడు

Kerala: కేరళలోని కోజికోడ్ జిల్లా ఎలత్తూర్ సమీపంలో దారుణం చోటు చేసుకుంది. రన్నింగ్ ట్రైన్‌లో గుర్తు తెలియని వ్యక్తి.. మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో చిన్నారి సహా ముగ్గురు మృతి చెందగా.. దాదాపు ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఇందులో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అలప్పుజా - కన్నూరు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎక్స్‌ప్రెస్‌లోని డి1 కంపార్ట్‌మెంట్‌లో నిన్న రాత్రి ఈ ఘటన జరిగింది.

మహిళకు నిప్పు పెట్టగానే.. తోటి ప్రయాణికులు ఆమెను కాపాడే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే మిగిలిన వారికి కూడా మంటలు అంటుకున్నాయి. ఎమర్జెన్సీ చైన్‌ లాగగానే.. నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. కోరాపుజా రైల్వే వంతెన వద్దకు చేరుకోగానే, ప్రయాణికులు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కి సమాచారం అందించి మంటలను ఆర్పివేశారు.

కాలిన గాయాలతో ఎనిమిది మందిని రైల్వే పోలీసులు ఆసుపత్రిలో చేర్పించారు. ఇద్దరు వ్యక్తుల మధ్య వాగ్వాదం తర్వాత ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. కోజికోడ్ సిటీ పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News