అభినందన్‌ను పట్టుకున్న పాక్ కమాండో మర్ గయా

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ను పట్టుకున్న పాక్‌ కమాండో హతమయ్యాడు. ఎల్‌వోసీ వెంట నక్యాల్ సెంటర్ వద్ద ఆగస్టు 17న భారత సైన్యం జరిపిన కాల్పుల్లో అహ్మద్ ఖాన్ మృతి చెందాడు.

Update: 2019-08-20 13:52 GMT

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ను పట్టుకున్న పాక్‌ కమాండో హతమయ్యాడు. ఎల్‌వోసీ వెంట నక్యాల్ సెంటర్ వద్ద ఆగస్టు 17న భారత సైన్యం జరిపిన కాల్పుల్లో అహ్మద్ ఖాన్ మృతి చెందాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 27న పాక్ యుద్ధ విమానాలను తరిమికొట్టే క్రమంలో ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్‌ ప్రమాదవశాత్తూ పాక్ గడ్డపై దిగిన విషయం తెలిసిందే. అభినందన్ నడిపిన ఐఏఎఫ్‌ మిగ్-21 బైసన్ జెట్‌.. పాక్‌కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చి సరిహద్దు సమీపంలో పాక్ భూ భాగంలో కూలిపోయింది. దీంతో అభినందన్ పాక్‌ సైన్యానికి పట్టుబడ్డారు. అభినందన్‌ పట్టుబడిన సందర్భంలో విడుదలైన ఫొటోల్లో అహ్మద్ ఖాన్‌ ఆయన వెనుకే ఉన్నాడు.నౌషేరా, సుందర్‌బన్, పల్లన్‌వాలా సెక్టార్ల నుంచి ఉగ్రవాదులను భారత్‌లోకి పంపడంలో కీలకంగా వ్యవహరించేవాడని సమాచారం.  

Tags:    

Similar News