కులభూషణ్‌ జాధవ్‌ కేసులో పాక్‌ కీలక నిర్ణయం

Update: 2019-08-01 13:07 GMT

తమ చెరలో ఉన్న భారత మాజీ నేవీ కమాండర్‌ కులభూషణ్‌ జాధవ్‌ను కలిసేందుకు రాయబార అనుమతించినట్లు ప్రకటించింది దాయాది పాకిస్థాన్‌. ఆగస్టు 2న కులభూషణ్‌ను కలిసేందుకు భారత్‌ అధికారులకు కాన్సులర్‌ యాక్సెస్‌ ఇస్తామని పాక్‌ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. తమ భూభాగంలో గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడుతున్నాడంటూ కుల్ భూషణ్ ను 2017లో అదుపులోకి తీసుకున్న పాకిస్థాన్ బలగాలు మరణ శిక్ష విధించారు. అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలతో కులభూషణ్ ను కలిసేందుకు భారత కాన్సులర్ అనుమతి ఇచ్చినట్లు పాక్ విదేశాంగ శాఖ తెలిపింది.

ఇదిలా ఉంటే జూలై 18న అంతర్జాతీయ కోర్టు విచారణ చేసి తీర్పును వెలువరించింది. కుల్ భూషణ్ జాదవ్‌కు మరణ శిక్షను రద్దు చేయాలని తీర్పు ఇచ్చింది. అంతేకాదు మరణశిక్ష విధించడంపై పునఃపరిశీలించాలని పాకిస్తాన్‌ను అంతర్జాతీయ కోర్టు కోరింది. కాగా ఇక ముందునుంచి భారత్ చెబుతున్నట్లుగా పాకిస్తాన్ వియన్నా కన్వెన్షన్‌ను ఉల్లంఘించిందని అంతర్జాతీయ న్యాయస్థానం అంగీకరించింది. అంతేకాదు జాదవ్ గూఢచర్యం చేయలేదని పేర్కొంది. 

Tags:    

Similar News