జాధవ్‌ను కలిసేందుకు పాక్‌ అనుమతి

Update: 2019-09-02 05:58 GMT

తన చెరలో ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల భూషణ్‌ జాదవ్‌పై పాకిస్థాన్‌ మెట్టు దిగింది. అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా భారత దౌత్యవేత్తలు ఆయన్ని కలిసేందుకు అనుమతించింది. ఇవాళ ఈ భేటీ జరుగుతుందని పాక్‌ విదేశాంగ అధికార ప్రతినిధి మొహ్మద్‌ ఫైజల్‌ ప్రకటించారు.గూఢచర్యం ఆరోపణలపై జాదవ్‌కు పాక్‌ సైనిక కోర్టు మరణ శిక్ష విధించింది. భారత్‌ ఐసీజేకు ఫిర్యాదు చేయడంతో, జాదవ్‌ను కలిసేందుకు దౌత్యవేత్తలను అనుమతించాలని ఐసీజే ఈఏడాది జూలైలో పాక్‌ను ఆదేశించింది. షరతులతో అనుమతిస్తామని ముందు ప్రతిపాదించిన పాక్‌, చివరికి ఇప్పుడు ఒప్పుకుంది. 

Tags:    

Similar News