ఇవాళ కశ్మీర్‌కు రాహుల్ నేతృత్వంలోని విపక్ష బృందం..పోలీసుల అనుమతిపై ఉత్కంఠ

Update: 2019-08-24 03:04 GMT

కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ నేడు శ్రీనగర్‌లో పర్యటించనున్నారు. జమ్ము కశ్మీర్‌ గవర్నర్‌ ఆఫర్‌ను స్వీకరించిన రాహుల్‌ మరో 9 ప్రతిపక్ష పార్టీల నాయకులతో కలిసి శ్రీనగర్‌లో పర్యటించనున్నారు. అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా పర్యవేక్షించనున్నారు. రాహుల్‌తో పాటు గులాం నబీ ఆజాద్, సీపీఎం, సీపీఐ, ఆర్జేడీ, టీఎంసీ, డీఎంకే పార్టీల సీనియర్ నేతలు శ్రీనగర్‌ వెళ్లనున్నారు. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత ఏ రాజకీయ నేతను జమ్ము కశ్మీర్‌లో పర్యటించడానికి అనుమతించలేదు. మరోవైపు ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత తొలిసారి జమ్ము కశ్మీర్‌కు వెళ్లేందుకు ప్రయత్నించిన కాంగ్రెస నేత గులాంనబీ ఆజాద్, సీపీఐ నేత రాజా, సీపీఎం నేత సీతారాం ఏచూరి లను ఇదివరకు పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపించారు. అయితే శనివారం ఉదయం రాహుల్ నేతృత్వంలోని ఈ బృందం పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

Tags:    

Similar News