మళ్లీ ఉల్లి లొల్లి: ఉల్లి రేటు..అదిరేట్టు

భారీ వర్షాల కారణంగా ఉల్లి దిగుబడి గణనీయంగా తగ్గింది. ఇక దీంతో ఉల్లిధరలు ఆకాశాన్ని అంటే ప్రమాదం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

Update: 2019-08-22 03:58 GMT

భారీ వర్షాల కారణంగా ఉల్లి దిగుబడి గణనీయంగా తగ్గింది. ఇక దీంతో ఉల్లిధరలు ఆకాశాన్ని అంటే ప్రమాదం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇటివల కురిసిన వర్షాలు, వదరల కారణంగా ఉల్లి కొరత ఏర్పడనుందని చెబుతున్నారు. అయితే ఇప్పటికే మార్కెట్ లో రూ.25 నుంచి రూ. 30 రూపాయల వరకూ కిలో ఉల్లి ధర ఉంది. ఉత్తర కర్నాటకలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ఖరీఫ్ పై ప్రభావం చూపే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రానున్న రోజులలో ఉల్లి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

Tags:    

Similar News