Nirbhaya Case: నిర్భయ దోషుల ఉరికి లైన్‌క్లియర్‌.. క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించిన రాష్ట్రపతి

Update: 2020-03-02 11:08 GMT
నిర్భయ దోషుల ఉరికి లైన్‌క్లియర్

నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలుపై ఉత్కంఠ తొలగింది. నిర్భయ దోషి పవన్‌ గుప్తా మెర్సీ పిటిషన్‌ను రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ తిరస్కరించారు. పిటిషన్‌ దాఖలైన రోజునే క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించారు. దీంతో నలుగురు దోషులకు న్యాయపరంగా అన్ని మార్గాలూ మూసుకుపోయాయి. నిర్భయ నిందితులకు ఉరి అమలు చేసేందుకు కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉండగా నిందితులు ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. అదే సమయంలో చివరి నిమిషం ప్రయత్నాల్లో భాగంగా నిందితుడు పవన్ గుప్తా తన ప్రయత్నాలను కొనసాగించాడు.

నిందితుడు పవన్ గుప్తా వేసిన క్యూరేటివ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించిన గంటలోనే రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు మరోసారి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నాడు. దీనిని పరిశీలించిన రాష్ట్రపతి క్షమాభిక్షకు దోషులు అనర్హులని తిరస్కరించారు. కాగా ఉరిశిక్షను జీవితఖైదుగా మార్చాలంటూ పవన్‌గుప్తా సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం ఇదివరకే కొట్టివేసిన విషయం తెలిసిందే. అలాగే డెత్‌వారెంట్‌పై స్టే ఇచ్చేందుకు ఢిల్లీ పటియాల హౌజ్ కోర్టు కూడా నిరాకరించింది. దీంతో నలుగురు దోషులను రేపు (మంగళవారం) ఉదయం ఆరుగంటలకు తీహార్‌ జైల్లో ఉరితీయానున్నారు. దీని కొరకు జైలు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు.

Tags:    

Similar News