కరోనాపై మోడీ ట్రంప్ ఫోన్ సంభాషణ

కోవిడ్ -19 సంక్షోభంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్‌లో విస్తృతంగా చర్చించామని ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు.

Update: 2020-04-04 17:24 GMT
Narendra Modi and Donald Trump (File Photo)

కోవిడ్ -19 సంక్షోభంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్‌లో విస్తృతంగా చర్చించామని ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. కరోనావైరస్ మహమ్మారిపై పోరాడటానికి క‌లిసిక‌ట్టుగా స‌ర్వశ‌క్తులు ఒడ్డేందుకు నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ఇదే విషయాన్నీ ప్రధాని మోడీ తన ట్విట్టర్ లో పేర్కొన్నారు.

కరోనా వైరస్ కారణంగా భారత్ లో ఇప్పటివరకు 75 మరణాలను నమోదు చేయగా, మొత్తం కేసుల సంఖ్య 3,072 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం సాయంత్రం తెలిపింది. ఇక అమెరికాలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 2, 77,458 కు చేరింది. 7,100 కంటే ఎక్కువ మంది చనిపోయారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 1,131,000 మందికి సోకగా, 59,800 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.




Tags:    

Similar News