తల్లి ప్రేమ: బిడ్డను కాపాడి తాను బలైంది!

Update: 2019-07-22 05:07 GMT

తల్లి ప్రేమకు సాటి మరేదీలేదు. ఉండదు. ఎన్నోసార్లు ఈ విషయాన్ని ఎందరో తల్లులు రుజువు చేశారు. తాము మరణించినా సరే.. తన బిడ్డకు ఏ ఆపదా రాకూడదని కోరుకుంటుంది అమ్మ. అందుకు ఉదాహరణే కర్ణాటకలో చోటుచేసుకున్న ఈ సంఘటన.

చామరాజనగర్‌ జిల్లా యల్లందూరు దొడ్డానెబెట్ట పరిధిలోని హలియూరు గ్రామంలో ఆదివారం ఎప్పటిలానే పొలం పనులు చూసుకుని తిరిగి ఇంటికి బయలు దేరింది గౌరమ్మ(35). చేతిలో నాలుగేళ్ల చిన్నారి ఉంది. ఈలోపు అకస్మాత్తుగా ఓ ఏనుగు దాడికి తెగబడింది. దీంతో ఆ ఎనుగునుంచి తప్పించుకునేందుకు పరుగు పెట్టింది గౌరమ్మ. అయితే, తడబాటుతో తూలి కింద పడిపోయింది. ఈలోపు ఏనుగు దగ్గరకు వచ్చేసింది. ఇక ఏం చేయాలో తోచని గౌరమ్మ తన బిడ్డ ప్రాణాలు కాపాడాలని నాలుగేళ్ళ కుమార్తెను పొదల్లోకి విసిరేసింది. తరువాత ఆ ఏనుగు గౌరమ్మను కాళ్ళతో తొక్కి, తొండంతో కొట్టడంతో ఆమె అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. గ్రామస్తులు, అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతోపాటు ఏనుగును అక్కడనుంచి తరిమేశారు. పొదల్లో చిన్నారి ఏడ్పులు వినిపించగా వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళారు. కాగా ఏనుగు దాడితో గ్రామస్తులలో భయం నెలకొంది.

Tags:    

Similar News