PM Modi: మోదీ హామీలు ఎన్నికల వాగ్దానాలు కావు.. ప్రతీ హామీ వాస్తవ రూపం దాల్చింది
PM Modi: 2047 వరకు గ్రామాలు పూర్తిస్థాయి అభివృద్ధి చెందేలా పనిచేయాలి
PM Modi: మోదీ హామీలు ఎన్నికల వాగ్దానాలు కావు.. ప్రతీ హామీ వాస్తవ రూపం దాల్చింది
PM Modi: కాంగ్రెస్ హయాంలో గ్రామ పంచాయతీల అభివృద్ధిని విస్మరించారని విమర్శించారు ప్రధాని మోడీ. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నాలుగు దశాబ్దాలైనా.. పంచాయతీరాజ్ వ్యవస్థ ఆవశ్యకతను కాంగ్రెస్ తెలుసుకోలేకపోయిందన్నారు. కాంగ్రెస్ హయాంలో గ్రామాల్లో అభివృద్ది పేపర్లకే పరిమితమైందన్న ప్రధాని.. అందుకు జమ్ముకశ్మీర్ ఉదాహరణ అని తెలిపారు. హర్యానాలో బీజేపీ క్షేత్రీయ పంచాయతీరాజ్ పరిషత్ రెండు రోజుల కాన్ఫరెన్స్‌లో బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు ప్రధాని మోడీ. 2047 వరకు గ్రామాలు కూడా పూర్తిస్థాయి అభివృద్ధి చెందేలా పనిచేయాలని.. గ్రామస్థాయిలో సమస్యలు తెలుసుకునేందుకు ప్రజలతో మమేకం అవ్వాలని సూచించారు.