వలసకూలీలు అంటే అంత చులకనా?

దేశవ్యాప్తంగా కరోనాని అడ్డుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ని విధించడంతో వలస కూలీల జీవితాలు రోడ్డు మీదా పడ్డాయి.

Update: 2020-05-24 04:09 GMT

దేశవ్యాప్తంగా కరోనాని అడ్డుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ని విధించడంతో వలస కూలీల జీవితాలు రోడ్డు మీదా పడ్డాయి. డబ్బులు లేకా, ప్రజా రవాణా లేకపోవడంతో చేసేది ఏమీ లేకా కాలినడకన వారి ప్రయాణం మొదలుపెడుతున్నారు. మొన్నటికి మొన్న తన తండ్రిని సైకిల్ వెనుక కూర్చోబెట్టుకొని జ్యోతి కుమారి అనే 15 ఏళ్ల యువతీ 1200కి.మీ ప్రయాణం చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి సంఘటనలు ఇంకా చాలానే ఉన్నాయి.

ఇలాంటి వలసకూలీలను వివిధ రాష్ర్టాల ప్రభుత్వాలు పలు రకాలుగా ఆదుకుంటుంటే మరికొంతమంది స్వచ్చందంగా ముందుకు వచ్చి ఆదుకుంటున్నారు. ఇక ఇది ఇలా ఉంటే పలు రాష్ర్టాల నుంచి వచ్చిన వలసకూలీలను మాత్రం ఇబ్బందులకు గురి చేస్తున్న ఘటనలు కూడా బయటకు వస్తున్నాయి. తాజాగా శ్రామిక్‌ రైళ్ళలో డిల్లీకి వచ్చిన వలసకూలీలను లాజ్‌పత్ నగర్‌లోని ఒక పాఠశాల వెలుపల నిలబెట్టి వారిని పశువులను కడిగినట్లు పెద్ద స్ప్రే పైపుతో వారిపై రసాయనాలు గుప్పించడం పెద్ద వివాదానికి దారి తీసింది.

రోడ్డుపై చల్లాల్సిన ప్రమాదకర రసాయనాలను వారిపై చల్లడం ఏంటి అని సామాజిక కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సంఘటన తరువాత, మునిసిపాలిటీ తమను తాము సమర్థించుకోవడానికి ప్రయత్నించింది. వారికీ క్షమాపణలు వెల్లడించిన్నట్లు పౌర సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.



Tags:    

Similar News