West Bengal: భారీ అగ్నిప్రమాదం.. 13 దుకాణాలు అగ్నికి ఆహుతి
West Bengal: ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో దగ్ధమైన షాపులు
West Bengal: భారీ అగ్నిప్రమాదం.. 13 దుకాణాలు అగ్నికి ఆహుతి
West Bengal: వెస్ట్ బెంగాల్ డార్జిలింగ్ జిల్లా సిలిగురిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పానిటంకీ మార్కెట్ సమీపంలోని రోడ్డుపక్కనున్న దుకాణాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల ధాటికి 13 దుకాణాలు కాలి బుడిదయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. తెల్లవారుజామునే ప్రమాదం జరగటంతో.. దుకాణాలు దారులు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో.. ప్రమాద తీవ్రత పెరిగింది.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంటలు ఎలా చెలరేగాయి..? అగ్ని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.