Madhya Pradesh: పెంపుడు కుక్కను కొట్టవద్దన్న కుటుంబ సభ్యులు.. భార్య, పిల్లలను చంపేసిన ఉన్మాది

Madhya Pradesh: ఇటీవల ఆటోను విక్రయించి ఇంటి వద్దే ఖాళీగా ఉంటున్నాడు.

Update: 2023-08-20 12:04 GMT

Madhya Pradesh: పెంపుడు కుక్కను కొట్టవద్దన్న కుటుంబ సభ్యులు.. భార్య, పిల్లలను చంపేసిన ఉన్మాది

Madhya Pradesh: మధ్య ప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయిని జిల్లా బాద్‌నగర్ ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. పెంపుడు కుక్కను కొట్టవద్దని వారించినందుకు ఓ ఉన్మాది భార్య పిల్లలను చంపేశాడు. ఆపై తాను కత్తితో పొడుచుకుని చనిపోయాడు. సరకు రవాణా ఆటో డ్రైవర్‌గా పని చేసే దిలీప్ పవార్ మద్యానికి బానిసగా మారాడు. ఇటీవల ఆటోను విక్రయించి ఇంటి వద్దే ఖాళీగా ఉంటున్నాడు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత తన పెంపుడు కుక్కను కొట్టడం ప్రారంభించాడు. కుక్క అరుపులకు కుటుంబ సభ్యులు లేచి చూశారు. కుక్కను కొట్టవద్దని అతడి భార్య గంగ, కుమారుడు యోగేంద్ర, కుమార్తె నేహా వారించారు. దీంతో పవార్ కత్తితో భార్య, ఇద్దరు పిల్లలను పొడిచి చంపేశాడు. మరో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కాపాడుకునేందుకు ఇంట్లో నుంచి పారిపోయారు. కొద్దిసేపటి తర్వాత నిందితుడు తనను తాను పొడుచుకుని చనిపోయాడు.

Tags:    

Similar News