కుక్కకు ఓటు హక్కు..

ఓటరు గుర్తింపు కార్డుల జారీ చేయడంలో అధికారుల పనితీరు మరోసారి బయటపడింది. అధికారులు తప్పిదం వలన ఓ వ్యక్తి ఫొటోకు బదులుగా కుక్క ఫోటో దర్శనం ఇచ్చింది.

Update: 2020-03-05 10:57 GMT
voter ID card with dog’s photo

ఓటరు గుర్తింపు కార్డుల జారీ చేయడంలో అధికారుల పనితీరు మరోసారి బయటపడింది. అధికారులు తప్పిదం వలన ఓ వ్యక్తి ఫొటోకు బదులుగా కుక్క ఫోటో దర్శనం ఇచ్చింది. దీనితో షాక్ అయిన సదరు వ్యక్తి దీనిని వెంటనే అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటు చేసుకుంది. అతని పేరు సునీల్ కర్మాకర్ .. ముర్షిదాబాద్ జిల్లా రామ్ నగర్ గ్రామానికి చెందిన సునీల్ కర్మాకర్ తన కొత్త ఓటర్ గుర్తింపు కార్డు కోసం దరఖాస్తు చేసుకోగా అందులో అతని ఫోటోకి బదులుగా కుక్క ఉన్న ఫోటో కనిపించింది. దీనితో అతనికి మతిపోయినంత పని అయింది..

వెంటనే ఈ విషయాన్ని అధికారులు దృష్టికి తీసుకువెళ్ళిన సునీల్ కర్మాకర్ ఎలక్షన్ కమీషన్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఉద్దేశపూర్వకంగానే ఇది జరిగిందని, బహిరంగంగా తనను అవమానించడానికి ఇదంతా చేశారని సునీల్ కర్మకర్ వెల్లడించాడు. నా కార్డు చూసిన వ్యక్తులు దీన్ని బహిరంగంగా ఎగతాళి చేస్తున్నారని, నేను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసిఐ)ను కోర్టుకు లాగుతాను, " సునీల్ కర్మకర్ పేర్కొన్నారు.

ఓటరు ఐడి కార్డు లోపాలను సరిదిద్దడంలో పాల్గొన్న ఒక ప్రభుత్వ అధికారి మాట్లాడుతూ.. ఇది కావాలని చేసింది కాదని, కానీ ఇది ఎలా జరిగిందో తమకి తెలియదని, లోపం ఎక్కడ జరిగిందో తెలుసుకుంటామని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా దీనిపై విచారణ జరిపి, నేరస్థులపై చర్యలు తీసుకుంటున్నామని ఆ అధికారి వెల్లడించారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక దీనిపైన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇంతా నిర్లక్ష్యంగా అధికారులు పని చేస్తున్నారని వారిని సస్పెండ్ చేయాలనీ కోరుతున్నారు. 

Tags:    

Similar News