కాసేపట్లో మకరజ్యోతి దర్శనం

శబరిమలలో అయ్యప్ప స్వామి దేవస్థానంలో బుధవారం సాయంత్రం మకరజ్యోతి దర్శనం కలగనుంది.

Update: 2020-01-15 12:32 GMT
శబరిమలలో నేడు మకరజ్యోతి దర్శనం

శబరిమలలో అయ్యప్ప స్వామి దేవస్థానంలో బుధవారం సాయంత్రం మకరజ్యోతి దర్శనం కలగనుంది. మకర జ్యోతి దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో గట్టి భద్రత ఏర్పాటు చేశారు.మకరజ్యోతి దర్శనం సందర్భంగా శబరిమల అయ్యప్ప స్వామి దేవస్థానంలో మకరవిలక్కు వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. భక్తులు మకరవిలక్కు వేడుకలలో పాల్గొనడంతోపాటు మకరజ్యోతిని దర్శించుకోనున్నారు..

శబరిమల కొండపై అపరూప ఘట్టం ఆవిష్కృతం కానుంది. అయ్యప్ప భక్తులకు మకర జ్యోతి దర్శనం జరగనుంది. ప్రతీ ఏడాది సంక్రాంతి రోజు జరగనున్న ఈ దివ్య దర్శనం కోసం వేల సంఖ్యలో అయ్యప్ప భక్తులు శబరిమల చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

భానుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే శుభవేళ, ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం కాగా, శబరిమల గిరులకు సమీపంలోని పొన్నాంబళ మేడుపై మకర జ్యోతి దర్శనం ఇస్తుందని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు ప్రకటించింది. స్వామి కోసం పందళ రాజ వంశీకులు తీసుకుని వచ్చే ప్రత్యేక ఆభరణాలను స్వామికి అలంకరించారు. ఆపై స్వామికి తొలి హారతిని ఇచ్చే సమయంలో మకర జ్యోతి, మకర విళక్కు దర్శనమిస్తాయని అధికారులు తెలిపారు.

మరోవైపు శబరిమల కొండ భక్తులతో కిక్కిరిసిపోయింది. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన దాదాపు 5 లక్షల మందికి పైగా భక్తులు ప్రస్తుతం పంబ నుంచి సన్నిధానం వరకూ క్యూ లైన్లలో వేచి చూస్తున్నారు. జ్యోతి దర్శనం నిమిత్తం టీబీడీ బోర్డు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో వేచి చూస్తున్నారు. ఇంకా వేల సంఖ్యలో భక్తులు సన్నిధానానికి వస్తుండగా, ప్రధాన పార్కింగ్ ప్రాంతమైన నీలక్కర్ వాహనాలతో కిక్కిరిసిపోయింది.



Tags:    

Similar News