న్యూయర్ షాక్.. భారీగా పెరిగిన వంట గ్యాస్ ధరలు

మధ్యతరగతి ప్రజలు ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సతమతమవుతున్నారు.

Update: 2020-01-01 10:18 GMT

మధ్యతరగతి ప్రజలు ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సతమతమవుతున్నారు. ఇదే నేపధ్యంలో ఇప్పుడు ప్రజలకు మరో షాక్ తగిలింది. ఒక్క సారిగా పెరిగిన వంట గ్యాస్ ధరలు కొత్త సంవత్సరంలో ప్రజల గుండెల మీద కుంపటిలా మారింది. ఇక పెరిగిన ఎల్‌పీజీ సిలిండర్ ధరలను 2020 జనవరి 1 నుంచే అమలులోకి తీసుకువస్తు్న్నట్టు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు తాజాగా ప్రకటించాయి. ఇప్పటి వరకూ ఉన్న ధర కంటే సిలిండర్ ధర అమాంతం రూ.19 మేర పెరిగింది. దీంతో సిలిండర్ ధర ఐదు నెలల్లో ఏకంగా రూ.140 పైకి కదిలింది. దీంతో ఎక్కువగా గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకునే వారిపై కొంత మేర అధిక భారం పడినట్టే.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సమాచారం ప్రకారం పెరిగిన ధరలను చూసుకుంటే 14.2 కిలోల సిలిండర్ న్యూఢిల్లీలో రూ. 19 పెరిగింది. దీంతో రూ.684గా ఉన్న సిలిండర్ ధర రూ. 714కు చేరింది. ముంబైలో రూ.19.50 పెరగగా రూ. 895గా ఉంది. ఇక కోల్కతాలో రూ. 747, చెన్నైలో రూ. 734గా సిలిండర్ ధరలు ఉన్నాయి. ఇతర ప్రాంతాల్లో రూ. 20 వరకు భారం పడనుంది. ఇదే సమయంలో 19 కిలోల బరువుండే కమర్షియల్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ. 1,241, ముంబైలో రూ. 1,190గా ఉందని ఇండియన్ ఆయిల్ పేర్కొంది. దీంతో వరుసగా ఐదో నెలలో సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధర పెరిగినట్లయింది. ఇదిలా ఉంటే పెంచిన ధరలు తక్షణమే అమలులోకి వస్తాయని ఐఓసీఎల్ వెల్లడించింది.   

Tags:    

Similar News