చిరుత ఆకస్మిక దాడి.. పరుగులు తీసిన జనం

Update: 2019-02-01 13:50 GMT

అరణ్యంలో ఉండాల్సిన చిరుత జనారణ్యంలోకి వచ్చింది. దాంతో కనిపించిన వారిపై పంజా విసిరింది. పంజాబ్‌ రాష్ట్రంలోని జలంధర్‌లో ఈ బీభత్సం జరిగింది. హిమాచల్‌ ప్రదేశ్‌ నుంచి పారిపోయిన చిరుత అటవీ మార్గం గుండా జలంధర్‌ చేరుకుంది. ఈ క్రమంలో జనావాసాలపై విరుచుకుపడి ప్రజలను గాయపరిచింది. సమాచారం అందుకున్న పంజాబ్‌ అటవీ శాఖ అధికారులు ముందుగా దాన్ని వల వేసి పట్టుకుందామని ప్రయత్నించినప్పటికీ వీలుకాలేదు..

దాంతో ట్రాంక్విలైజర్‌ గన్‌ను ఉపయోగించి చిరుతను అదుపు చేశారు. మెల్లగా అది మత్తులోకి జారుకోవడంతో వలపన్ని పట్టుకున్నారు. అనంతరం జనాలు ఊపిరి పీల్చుకున్నారు. గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. 

Similar News