Kiran Kumar Reddy: నేడు బీజేపీలో చేరనున్న కిరణ్ కుమార్ రెడ్డి
Kiran Kumar Reddy: ఢిల్లీలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి
నేడు బీజేపీలో చేరనున్న కిరణ్ కుమార్ రెడ్డి
Kiran Kumar Reddy: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాషాయ కండువా కప్పుకోనున్నారు. కిరణ్‌కుమార్ రెడ్డి ఇవాళ బీజేపీలో చేరనున్నారు. కొద్ది రోజుల క్రితమే ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి సీఎంగా కిరణ్‌కుమార్‌రెడ్డి పని చేశారు. ఏపీలో కాంగ్రెస్ పుంజుకునే అవకాశాలు లేకపపోవడంతో బీజేపీ నేతల ఆహ్వానంతో ఆ పార్టీలో చేరేందుకు కిరణ్ కుమార్ రెడ్డి సిద్దమయ్యారు. హైదరాబాద్ కేంద్రంగా బీజేపీలో ఆయన కీలక పాత్ర పోషించనున్నారని చెబుతున్నారు. జాతీయ స్థాయిలో కీలక పదవి ఇస్తామని కాషాయదళం హామీ ఇచ్చిందని, అందులో భాగంగానే బీజేపీ గూటికి వెళుతున్నారని తెలుస్తోంది. డిసెంబర్‌లో తెలంగాణ ఎన్నికలు జరగనుండగా.. ఈ క్రమంలో కిరణ్ కుమార్ రెడ్డి ఎంట్రీ బీజేపీగా ఎలా కలిసొస్తుందనేది ఆసక్తికరంగా మారింది.