శభాష్ : ప్రేమకి అసలైనా అర్ధం చెప్పావమ్మా!

ప్రేమ అనేది అందం, ఆస్తిని చూసి పుట్టదు అని చెప్పడానికి ఇదో చక్కటి ఉదాహరణ.. ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ లో గాయపడి నడవలేని ఓ యువకుడి

Update: 2020-03-08 16:10 GMT

ప్రేమ అనేది అందం, ఆస్తిని చూసి పుట్టదు అని చెప్పడానికి ఇదో చక్కటి ఉదాహరణ.. ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ లో గాయపడి నడవలేని ఓ యువకుడిని ఓ అమ్మాయి అర్ధం చేసుకొని అతన్ని ప్రేమించి, చివరికి అతన్ని ఒప్పించి పెళ్ళాడింది. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఇప్పుడీ పెళ్లి గురించి దేశమంతా చర్చించుకుంటుంది.

ఇక వివరాల్లోకి వెళ్తే త్రిశూర్‌కు చెందిన ప్రణవ్‌ కు ఆరేళ్ల క్రితం రోడ్డు ప్రమాదం జరిగింది. దీనితో అతను కేవలం వీల్‌చైర్‌కు మాత్రమే పరిమితం అయ్యాడు. దీనితో అతను ఇంకొకరి సహాయంపైన ఆధారపడాల్సి వస్తోంది. కానీ అతను మాత్రం దైర్యం కోల్పోకుండా ఆలయాల్లో జరిగే ఉత్సవాలకు వెళ్తూ అక్కడ జరిగే ఉత్సవాలని తిలకించేవాడు.. దీనికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను ప్రణవ్ ఫ్రెండ్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇవి వైరల్ గా మారాయి..

ఈ నేపధ్యంలో తిరువనంతపురంలో నివసిస్తున్న షహానా ఈ వీడియోలను చూసింది. ఆ తర్వాత అతని దైర్యం నచ్చి అతనితో సోషల్ మీడియా ద్వారా పరిచయం పెంచుకుంది. ఆ పరిచయంలో ప్రణవ్ బాగా నచ్చడంతో అతనికి తన ప్రేమ విషయాన్ని చెప్పింది. కానీ అందుకు ప్రణవ్ ముందుగా ఒప్పుకోలేదు. నీకు మంచి భవిష్యత్తు ఉంది ఇంకెవరినైనా పెళ్లి చేసుకో అని చెప్పగా, అందుకు షహానా ఒప్పుకోక పెళ్లంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటానని చెప్పుకొచ్చింది. చివరగా తన కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకొంది..

ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రేమకి అసలైనా అర్ధం చెప్పావ్ అని నెటిజన్లు ఆ యువతిని అభినందిస్తున్నారు. 

 

Tags:    

Similar News